ఓ మహిళా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన కేటీఆర్

KTR: పెద్ద మనసు చాటుకున్న మాజీ మంత్రి కేటీఆర్

Update: 2023-12-25 02:59 GMT

ఓ మహిళా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన కేటీఆర్

KTR: మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఓ మహిళా కుటుంబానికి అండగా నిలిచారు. మహిళ బాధలు విని చలించిన కేటీఆర్.. ఆమెకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు.

ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్‌కు చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్‌కు వచ్చింది. తన ఇబ్బందులను ధరఖాస్తు రూపంలో ప్రజా దర్బార్‌లో సమర్పించింది. అలాగే తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తన బాధను వెల్లబోసుకుంది. అన్నపూర్ణ బాధలు విన్న తర్వాత, ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు కేటీఆర్. బంజారాహిల్స్ లోని తన ఇంటికి పిలుచుకొని మరీ చెక్కు అందించారు. తన కూతురు విద్య కోసం, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన కేటీఆర్ కి అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపింది.


Tags:    

Similar News