KTR: లంకె బిందెల కోసం వెతికేవారు అధికారంలోకి వచ్చారు

KTR: లంకె బిందెల కోసం వెతికేది ఎవరో ప్రజలకు తెలుసు

Update: 2024-02-02 10:44 GMT

KTR: లంకె బిందెల కోసం వెతికేవారు అధికారంలోకి వచ్చారు

KTR: లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డిను ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్‌ను బొందపెడతామని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని... అలాంటి వారిని చాలా మందినే చూశామన్నారు. సచివాలయంలో లంకె బిందెలు ఉండవని.... కంప్యూటర్లు, జీవోలు ఉంటాయని ఎద్దేవా చేశారు. లంకె బిందెల కోసం వెతికేది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News