KTR: బీజేపీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది
KTR: బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు
KTR: బీజేపీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది..
KTR: బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌కు డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని.. కాంగ్రెస్ తనకున్న 40 స్థానాలను కూడా నిలబెట్టుకునే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్‌పై మమతా వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానన్న కేటీఆర్... కాంగ్రెస్ వ్యవహారశైలి వల్లే ఇండియా కూటమి చెల్లాచెదురవుతుందన్నారు. గుజరాత్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటాపడాల్సి ఉన్న కాంగ్రెస్.
ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుందని.. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు కేటీఆర్. నిజానికి బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని.. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే బీజేపీని అడ్డుకోగలరని కేటీఆర్ ట్వీట్ చేశారు.