పేదలకు కిషన్ రెడ్డి నుంచి స్పెషల్ కిట్లు...

లాక్ డౌన్ నేపథ్యంలోనే పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేదలకు నిత్యావస సరుకులను పంపిణీ చేస్తున్నారు.

Update: 2020-05-03 12:56 GMT
kishan reddy(File photo)

లాక్ డౌన్ నేపథ్యంలోనే పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేదలకు నిత్యావస సరుకులను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉండడంతో ఆయన సతీమణి కావ్య హైదరాబాద్‌లో నిర్వహించే ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది పేదలు కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారు ఈ కష్టకాలంలో పస్తులుండకూడదన్న ఉద్దేశంతో నిత్యావసరాల పంపిణీని చేపట్టామని ఆమె తెలిపారు.

ఇందులో భాగంగా నగరంలోని సుమారు 10 వేల పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ఇందుకోసం తొమ్మిది రకాల నిత్యావసరాలతో 'మోదీ కిట్'ను సిద్ధం చేయించామని ఆమె తెలిపారు. అంతే కాక కరోనాను తరిమికొట్టేందుకు నిత్యం శ్రమిస్తున్న పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి పండ్ల రసాలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బస్తీల్లో నిత్యావసర వస్తువులను సోమవారం పంపిణీ చేయనున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజలకు బీజేపీ శ్రేణులు అండగా ఉండాలని కిషన్ రెడ్డి సతీమణి పిలుపునిచ్చారు.

ఇక ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు ఏకాభిప్రాయంతోనే లాక్ డౌన్ ను పొడిగించామని ఆయన తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే జోన్లను ఏర్పాటు చేశామని తెలిపారు.  

Tags:    

Similar News