Kishan Reddy: టమాటా..ఎట్లిస్తున్నావ్..?.. 30 రూపాయలకు కిలో సార్..

Kishan Reddy: డిజిటల్ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Update: 2024-02-03 12:00 GMT

Kishan Reddy: టమాటా..ఎట్లిస్తున్నావ్..?.. 30 రూపాయలకు కిలో సార్..

Kishan Reddy: కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బోరబండలోని SRT కూరగాయల మార్కెట్లో ఆకస్మికంగా పర్యటించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం.. మార్కెట్‌లోకి వెళ్లారు. కూరగాయల విక్రేతల దగ్గరకు వెళ్లి. అమ్మా.. టమాటా ఎట్లిస్తున్నవ్.. ? అని అడగగానే.. కేంద్రమంత్రిని చూసి ఆశ్చర్యపోయిన ఆ మహిళ.. సార్ 30 రూపాయలకు కిలో అని చెప్పింది. కిలో టమాటాలు కొనుగోలు చేసిన కేంద్ర మంత్రి.. డిజిటల్ పేమెంట్ పేమెంట్ చేశారు.. మార్కెట్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ధర గిట్టుబాటు అవుతోందా? ఏమైనా ఇబ్బందులున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఇతర దుకాణదారులతోనూ కేంద్రమంత్రి మాట్లాడారు. 

Tags:    

Similar News