Kishan Reddy: బండి సంజయ్‌ కోసం అందరం కలిసి పోరాడుతాం

Kishan Reddy: తెలంగాణ వ్యతిరేక శక్తులకు బీఆర్‌ఎస్‌ కేంద్రంగా మారింది

Jyothi
Published on: 6 April 2023 5:50 PM IST
Kishan Reddy Said that Everyone Will fight Together for Bandi Sanjay
X

Kishan Reddy: బండి సంజయ్‌ కోసం అందరం కలిసి పోరాడుతాం

Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను ఖండిస్తూ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలు చేసిన కష్టానికి ప్రతిఫలంగానే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీపై కొన్ని పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయన్నారు.

తెలంగాణ వ్యతిరేక శక్తులకు బీఆర్‌ఎస్‌ కేంద్రంగా మారిందన్న ఆయన తెలంగాణ వద్దన్న వాళ్లకు ప్రగతి భవన్‌ కేంద్రమైందన్నారు. నిజాం ఆలోచనతో కేసీఆర్‌ ప్రభుత్వం నడస్తుందని.. బండి సంజయ్‌ కోసం అందరం కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. అవినీతి పాలనను అంతమొందించే వరకు పోరాటం ఆగదన్నారు కిషన్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story