Hyderabad: లిఫ్ట్ ఇస్తే రేప్ కేసు.. జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్..
Hyderabad: కిలాడీ లేడీల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
Hyderabad: లిఫ్ట్ ఇస్తే రేప్ కేసు.. జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్..
Hyderabad: రాజధానిలో లేడీ కిలాడీ... మొదట లిఫ్ట్ ప్లీజ్ అంటూ కవ్విస్తుంది. తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగినంటూ మాటల్లోకి దించి ఆకర్షిస్తోంది. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి వలపు వల విసిరి మాటల్లోపెట్టి తనను రేప్ చేశావంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఇలా హైదరాబాద్‌లో పలువుర్ని బురిడి కొట్టించి లేడీ కిలాడీ చివరకు పోలీసులకు దొరికిపోయింది. జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు.. లిఫ్ట్ అడిగింది. పరమానంద అనే కారు డ్రైవర్ లిఫ్ట్ ఇచ్చాడు. కొద్ది దూరం వెళ్లాక.. తనను రేప్ చేసేందుకు ప్రయత్నించావంటూ.. బట్టలు చించుకుని.. డబ్బులు డిమాండ్ చేసింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. పోలీసులకు అప్పగించారు.
ఆమె పేరు సయీదా నయీమా సుల్తానా చాలా తెలివైనది. జీవితంలో ఎన్నో పరాభవాలు చవిచూసిన సయిూదా డబ్బుల కోసం పెడదారులు పట్టింది. వ్యసనాలకు బానిసై అడ్డదారులు తొక్కింది. మామూలుగా దబాయిస్తే నమ్మరని.. పక్కాగా చట్టంలోని సెక్షన్లను కంఠస్తం చేసుకుంది. పలు కేసు స్టడీ ఫైళ‌్లను కూడా సేకరించింది. వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను బెదిరిస్తూ ఇన్నాళ్ళు పబ్బం గడుపుకుంది.
గత కొన్నేళ్లుగా... నగరంలో పలు ప్రాంతాల్లో కుర్రాళ్లను లిఫ్ట్ అడిగి.. బెదిరిస్తూ.. డబ్బులు దండుకుంది. నగరంలో ఈమెపై పలు స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక‌్షన్ 389 కింద కేసు నమోదు చేశారు. లిఫ్ట్ అడిగి.. మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి కిలాడీ లేడీపట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ యువతను ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.