కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్‌నాయక్
Shyam Naik: రవాణాశాఖలో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న శ్యామ్ నాయక్
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్‌నాయక్
Shyam Naik: కొమురం భీం జిల్లా ఖానాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్‌నాయక్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇవాళ రాత్రి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ ప్రభుత్వ రవాణశాఖలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్‌గా పనిచేసిన శ్యామ్ నాయక్ ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. శ్యామ్ నాయక్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని, ఆసిఫాబాద్ నుంచి బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనుంచి అభ్యర్థిత్వం పట్ల భరోసా రావడంతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత శ్యామ్ నాయక్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే
శ్యామ్ నాయక్ ప్రత్యక్ష రాజకీయాల్లో కి వస్తున్ననేపథ్యలో ఆయన భార్య రేఖానాయక్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖానాపూర్ స్థానానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. భర్త శ్యామ్ నాయక్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరగా... రేఖానాయక్ రేపు ఉదయం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు.