Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ మహా నిమజ్జన ఏర్పాట్లు షురూ..

Khairatabad Ganesh: ఈరోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ

Update: 2023-09-27 06:54 GMT

Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ మహా నిమజ్జన ఏర్పాట్లు షురూ

Khairatabad Ganesh: హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏటా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించే భాగ్యనగరవాసులు.. గతేడాదికి మించి ఈ సారి రికార్డు స్థాయిలో ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం కాగా పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై భాగ్యనగర ఉత్సవ సమితి సమావేశం నిర్వహించింది.

ఖైరతాబాద్ బడా గణేశ్ మహా నిమజ్జనానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు స్టార్ట్ చేసింది. ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటలకు మహాగణపతికి చివరి పూజ నిర్వహించనున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. మహాగణపతిని తరలించేందుకు భారీ క్రేన్ అండ్ తస్కర్ రాత్రి 9 గంటలకు మండపం వద్దకు చేరుకోనున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మహాగణపతిని కదిలించనున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. రాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఇతర విగ్రహాలను భారీ తస్కర్‌పై ఎక్కించనున్నారు.

అనంతరం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మహాగణపతిని భారీ వాహనంపైకి ఎక్కించి వెల్డింగ్ వర్క్‌ను ప్రారంభిస్తారు. ఇక ఉదయం ఏడు గంటల తర్వాత ఖైరతాబాద్ మహాగణపతి శోభాయత్ర ప్రారంభంకానుంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకోనున్నాడు మహాగణపతి. ఉదయం తొమ్మిదిన్నర సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోనున్నాడు. అనంతరం భారీ వాహనంపై నుంచి మహాగణపతి విగ్రహం తొలగింపు ప్రక్రియ ప్రారంభవమవుతుంది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఉదయం పదిన్నర గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉదయం పదకొండున్నర గంటల నుంచి హుస్సేన్‌సాగర్‌లో మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News