విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం కేసీఆర్‌కు కీలక నివేదిక..
Visakha Steel Plant: సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేయనున్న సింగరేణి అధికారుల బృందం..?
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం కేసీఆర్‌కు కీలక నివేదిక..
Visakha Steel Plant: వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై ముందుకేనంటూ కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు కూడా బిడ్డింగ్ విషయంలో మరో ముందడుగు వేసింది. ఇప్పటికే సింగరేణి సంస్థ వైజాగ్ స్టీల్స్ పై అధ్యయనం మొదలు పెట్టింది. సింగరేణి అధికారులు విశాఖ వెళ్లి రెండురోజులపాటు అక్కడే ఉండి స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేసి వచ్చారు. వారు తమ నివేదికను ఈరోజు సీఎం కేసీఆర్ కి అందిస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మూలధనం సమకూర్చడం వల్ల కలిగే లాభమేంటి..? దానిపై పెట్టిన పెట్టుబడిని ఎలా తిరిగి రాబట్టుకోవచ్చు.. అనే విషయాలపై వారు నివేదిక తయారు చేశారు. దాన్ని ఈరోజు సీఎం కేసీఆర్ కి అందిస్తారు.