ఎన్నికల జోష్‌లో బీఆర్ఎస్‌.. ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన.. 17 మందిని ప్రకటించిన..

MLA Candidates: గులాబీ దళం ఎన్నికలకు సమాయత్తమవుతోంది.

Update: 2023-06-13 16:00 GMT

ఎన్నికల జోష్‌లో బీఆర్ఎస్‌.. ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన.. 17 మందిని ప్రకటించిన..

MLA Candidates: గులాబీ దళం ఎన్నికలకు సమాయత్తమవుతోంది. గతంలో కంటే డిఫరెంట్‌ స్ట్రాటజీని అమలు చేస్తూ.. ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఇన్‌ డైరెక్ట్‌గా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుండటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే టికెట్ల ప్రకటన అప్పుడే మొదలైందా..? అధినేత ఆదేశాలతోనే మంత్రుల నోట అభ్యర్థుల పేర్లు వస్తున్నాయా...? అభ్యర్థుల ప్రకటనలో కొత్త విధానానికి శ్రీకారం వెనుక బీఆర్ఎస్ వెనుక ఉన్న వ్యూహమేంటి అన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంది. అయితే ఈ సారి బీఆర్ఎస్‌లో సిటింగ్‌లకే టికట్లు వస్తాయనేది దాదాపు ఖరారైనప్పటికీ.. టికెట్లు రావాలంటే పనితీరు మెరుగుపరుచుకోండంటూ గులాబీ బాస్ సిట్టింగ్‌లకు సూచించారు. దీంతో ఈ విషయంలో కొన్నాళ్ల క్రితం వరకు కూడా క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తమ పర్యటనల్లో కొందరు అభ్యర్థుల పేర్లు చెబుతూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఎలాంటి అభ్యంతరం లేని లీడర్లు ఉన్న స్థానాల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తున్నారంటూ బీఆర్ఎస్‌ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు నియోజకవర్గాల పర్యటనల్లో 17 మంది అభ్యర్థులను ప్రకటించారు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు. హుజూరాబాద్ నియోజకవర్గానికి పాడి కౌశిక్ రెడ్డి, భూపాలపల్లికి గండ్ర వెంకటరమణారెడ్డి, హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ఒడిదెల సతీష్, వర్ధన్నపేటకు ఆరూరి రమే‌శ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి వినయ్‌ భాస్కర్‌ను ప్రకటించారు. ఇక మిర్యాలగూడ నియోజకవర్గానికి నల్లమోతు భాస్కరరావు, ఆందోల్‌కి చంటి క్రాంతి కిరణ్, అచ్చంపేటకి గువ్వల బాలరాజు, దేవరకద్రకు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎల్లారెడ్డికి జాజుల సురేందర్, ఇబ్రహీంపట్నంకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గానికి సండ్ర వెంకటవీరయ్య, నిజామాబాద్ అర్బన్‌కు గణేష‌ గుప్తా, బోధన్‌కు షకీల్ అహ్మద్‌, కూకట్‌ పల్లి నియోజకవర్గానికి మాధవరం కృష్ణారావులను మంత్రులు, కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మరోసారి మంత్రి గంగుల పోటీకి దిగుతారని.. ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ స్వయంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా.. ఎన్నికలకు ఆరు నెలల ముందే మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు ప్రకటిస్తున్నారు. ముందస్తుగానే ఇలా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పార్టీ కేడర్‌ మరింత ఉత్సాహంగా పనిచేస్తుందన్న స్ట్రాటజీ బీఆర్ఎస్ అమలు చేస్తుందా..? ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఎన్నికల నాటికి లోకల్‌ పరిస్థితులు అనుకూలంగా మారుతాయని అధిష్టానం భావిస్తుందా..? స్ట్రాటజీ ఏదైనా మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం కాస్త టెన్షన్ నెలకొందనే చెప్పాలి. తమకు టికెట్ వస్తుందా లేదా అని.. మంత్రుల నోట తమ పేరు కూడా వినిపిస్తుందా అంటూ ఎమ్మెల్యేలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Tags:    

Similar News