MLC Kavitha: చేనేతల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది
MLC Kavitha: సోలపూర్‌లో చేనేత పరిశ్రమలు, కార్మికులతో సంభాషించిన కవిత
MLC Kavitha: చేనేతల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది
MLC Kavitha: దేశానికి తెలంగాణ మోడల్ దారి చూపుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ..వారి సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనన్ని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఇటీవల సోలపూర్‌కు వెళ్లిన కవిత అక్కడి వస్త్ర పరిశ్రమలను సందర్శించి వాటి నిర్వాహకులు, కార్మికులతో సంభాషించారు. తెలంగాణలో పవర్ లూమ్ పరిశ్రమలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక రాయితీలు కల్పిస్తున్నారని ఆమె తెలిపారు.