Ravi Shankar: ముచ్చటగా మూడోసారి కేసిఆర్ చరిత్ర సృష్టించడం ఖాయం
Ravi Shankar: సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్న రవిశంకర్
Ravi Shankar: ముచ్చటగా మూడోసారి కేసిఆర్ చరిత్ర సృష్టించడం ఖాయం
Ravi Shankar: జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు చొప్పదండి నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు, తనకు మద్దతుగా నిలవాలని రవిశంకనర్ కోరారు. కేసిఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని సకలజనం మెచ్చిన నేత కేసిఆర్ అని ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బిజెపిలకు వణుకు పుడుతుందని అన్నారు. ప్రజలంతా కేసీఆర్ వెన్నంటే ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి విజయం సాధించి కేసిఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.