Puvvada Ajay: ఆర్టీసీ ఆస్తులను కాపాడిన ఘనత కేసీఆర్‌దే

Puvvada Ajay: ఆర్టీసీ విలీనం అంశంపై విమర్శించిన వారిపై మంత్రి ఫైర్

Update: 2023-09-03 10:43 GMT

Puvvada Ajay: ఆర్టీసీ ఆస్తులను కాపాడిన ఘనత కేసీఆర్‌దే

Puvvada Ajay: ఆర్టీసీకి ఆస్తులను ఏర్పాటు చేసి, ఆస్తులను కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నూతన బస్టాండు ప్రాంగణంలో ఆర్టీసీ కన్వెన్షన్ సెంటర్‌కు మంత్రి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. రెండెకరాల స్థలంలో 40 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఆర్టీసీ కన్వెన్షన్ సెంటర్‌ నిర్మిస్తామన్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్ ఖమ్మం సిగలో మరో కలికితురాయిగా నిలిచేలా నిర్మిస్తామన్నారు.

ఆర్టీసీ ఆస్తులను దోచుకోవడం కోసమే సీఎం కేసీఆర్ ఆర్టీసీని విలీనం చేసుకున్నారన్న విమర్శలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఇవరం సవరం తెలియని ఎచ్చి పెచ్చి గాళ్లు ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన.... కరోనా సమయంలో ఆర్టీసీ నష్టాల్లో ఉంటే 15 వందల కోట్ల రూపాయలు కేటాయించి ఆర్టీసీని, కార్మికులను కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారాయన.... పేద, మధ్య తరగతి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఆర్టీసీని విలీనం చేశామమని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.

Tags:    

Similar News