KCR Health Update: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కేటీఆర్
KCR Health Update: మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
KCR Health Update: మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గురువారం సాయంత్రం సాధారణ వైద్య పరీక్షల కోసం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని, రక్తంలోని షుగర్, సోడియం లెవెల్స్ పర్యవేక్షణ కోసం వైద్యులు కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని సూచించారని తెలిపారు.
కేసీఆర్ ఆరోగ్యంపై ఎలాంటి తీవ్రమైన సమస్యలు లేవని, అభిమానులు, నాయకులు, ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.