ప్రముఖ నటి, దర్శకురాలు సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల (73) ఈ రోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. విజయ నిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని ప్రార్దించారు. అలాగే ఆమె మరణ వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విజయ నిర్మల అంత్యక్రియలు రేపు ఉదయం మహా ప్రస్థానంలో జరగనున్నాయి.