KCR: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్
KCR: తెలంగాణలో అత్యంత ప్రాధాన్యమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
KCR: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్
KCR: తెలంగాణలో అత్యంత ప్రాధాన్యమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారతీయ రాష్ట్ర సమితి (భారాస) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఈ రోజు కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట హాజరయ్యారు.
బీఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నిస్తోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వల వివరాలు తదితర అంశాలపై వివరణ కోరినట్లు సమాచారం.
కేసీఆర్‌తో పాటు, విచారణకు రావడానికి 9 మంది నేతలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు ఈ కమిషన్ 114 మందిని విచారించిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీశ్ రావు ఈ same కమిషన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో కాళేశ్వరం విచారణ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.