ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు నిరసనలు

Update: 2019-09-23 09:52 GMT

కరీంనగర్ టౌన్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు నేడు వన్ డిపో ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయని వేచి చూసినా కూడా విలీనం చేయలేదని అందుకే నమ్మకం పోయి నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో బంద్ నిర్వహిస్తామని, బస్సు చక్రాలు బంద్ అయితే మా బాధలు ఏంటో తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోవు దసరా సీజన్లో గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని లేదంటే పూర్తి స్థాయిలో సమ్మెకు సిద్ధమని హెచ్చరిక జారీ చేశారు. కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రజల సౌకర్యార్థం సమ్మెను అనివార్యం చేయకూడదని, ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన కోరికలు నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News