Kalvakuntla Kavitha: మాట్లాడితే నా భర్త ఫోన్‌ను ట్యాప్ చేయించారు.. గత ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆరోపణలు
Kalvakuntla Kavitha: గత ప్రభుత్వ హయాంలో తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని, ముఖ్యంగా తన భర్త ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
మాట్లాడితే నా భర్త ఫోన్‌ను ట్యాప్ చేయించారు.. గత ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆరోపణలు
Kalvakuntla Kavitha: గత ప్రభుత్వ హయాంలో తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని, ముఖ్యంగా తన భర్త ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. "గత ప్రభుత్వ హయాంలో ఇంటి అల్లుడని కూడా చూడకుండా నా భర్త ఫోన్‌ను ట్యాప్ చేయించారు" అని పేర్కొన్నారు.
కవిత ఈ సందర్భంగా దొంగచాటుగా తమ వ్యక్తిగత సంభాషణలను వినడం ఎంతవరకు పద్ధతి అని ప్రశ్నించారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వివాదాన్ని రాజేసే అవకాశం ఉంది.