కాళేశ్వరం జలాల ఎత్తిపోత ప్రారంభం..
*ఐదు నెలల తరువాత పునఃప్రారంభమైన ఎత్తిపోతలు
కాళేశ్వరం జలాల ఎత్తిపోత ప్రారంభం..
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతల ప్రక్రియ ఐదు నెలల తరువాత పునఃప్రారంభమైనది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో రెండు పంపులతో నీటిని ఎత్తి పోస్తున్నారు ఇంజినీరింగ్ అధికారులు జులైలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు రావడంతో పంపుహౌస్ నీట మునిగిన విషయం తెలిసిందే రక్షణ గోడ కూలి పంపుహౌస్‌లోకి వరద చేరడంతో పంపులు మోటార్లు నీట మునిగి దెబ్బతిన్నాయి. తొలుత రక్షణగోడను పునరుద్ధరించిన అధికారులు అనంతరం నీటిని తోడేసి 20 రోజుల క్రితమే మరమ్మతులు పూర్తి చేశారు. రెండు పంపుల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించామని ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నామని తెలిపారు.