జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వేళ ఉద్రిక్త పరిస్థితులు.. షేక్‌పేట్‌ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతల దాడి

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. షేక్‌పేట్‌ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు.

Arun Chilukuri
Published on: 11 Nov 2025 11:53 AM IST
జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వేళ ఉద్రిక్త పరిస్థితులు.. షేక్‌పేట్‌ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతల దాడి
X

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వేళ ఉద్రిక్త పరిస్థితులు.. షేక్‌పేట్‌ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతల దాడి

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. షేక్‌పేట్‌ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. బీజేపీ నేతలు బయట తిరగొద్దంటూ కాంగ్రెస్‌ నేత సాయినాథ్‌ అలియాస్‌ లడ్డూతో పాటు మరో నలుగురు కలిసి స్వస్తిక్‌పై దాడిచేశారు.

అయితే.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌.. కాంగ్రెస్‌ నేతలపై ఫిల్మ్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు.. వాలి స్కూల్లోని పోలింగ్ స్టేషన్‌ దగ్గర పోలీసులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. పెద్దఎత్తున ఏజెంట్లు గుమిగూడటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story