నేడు నిజామాబాద్, సంగారెడ్డిలో జేపీ నడ్డా ప్రచారం

Telangana: నేడు తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచారం

Update: 2023-11-23 03:45 GMT

నేడు నిజామాబాద్, సంగారెడ్డిలో జేపీ నడ్డా ప్రచారం

Telangana: ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు నేతలు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నేతలు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో కీలకమైన ఈ వారం రోజుల పాటు బలమైన నాయకత్వాన్ని ప్రజల్లోకి పంపడం ద్వారా ప్రచార రేసులో ఇతర పార్టీల కంటే ఎక్కడా వెనకబడ్డామనే భావన కలగకుండా ఉండేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే.. ఇవాళ తెలంగాణకు జేపీ నడ్డా రానున్నారు. నిజామాబాద్, సంగారెడ్డిలో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్ రాంకోఠిలో పీయూష్ గోయల్, ఖైరతాబాద్‌లో గోవా సీఎం ప్రమోద్ పాదయాత్ర, ఇక

సిరిసిల్ల బహిరంగ సభలో స్మృతి ఇరానీ పాల్గొననున్నారు.

ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా బహిరంగసభలతో ప్రచారాలు చేస్తుండగా.. ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు ప్రధాని మోడీ ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 25న తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ.. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లా్ల్లో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 25 నిమిషాలకు దుండిగల్ చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కామారెడ్డి జిల్లాలో ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లాలో ప్రచారంలో పాల్గొంటారు. ఆరోజు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు ప్రధాని.

ఇక 26న దుబ్బాక, నిర్మల్‌లో బహిరంగ సభల్లో పాల్గొంటారు ప్రధాని. మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాక వెళ్లనున్న ప్రధాని.. 2 గంటల 45 నిమిషాల వరకు దుబ్బాకలో నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. అనంతరం నిర్మల్ కు వెళ్లి... మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు ప్రసంగిస్తారు. బహిరంగ సభల అనంతరం దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని.. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు తిరుపతికి బయలుదేరతారు ప్రధాని.

27వ తేదీన తిరుపతి నుంచి 11 గంటల 30 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని.. నేరుగా మహబూబాబాద్ వెళ్తారు ప్రధాని. 12 గంటల 45 నిమిషాలకు మహబూబాబాద్‌లో ప్రసంగించి.. ఆ తర్వాత కరీంనగర్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో అనంతరం ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీ బయలుదేరతారు ప్రధాని. 

Tags:    

Similar News