Jagga Reddy: రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు
Jagga Reddy: భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagga Reddy: భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్‌కు విలువలతో కూడిన రాజకీయాలు తెలియవని మండిపడ్డారు.
రాహుల్ గాంధీది త్యాగాలు చేసిన కుటుంబమని జగ్గారెడ్డి అన్నారు. దీనికి విరుద్ధంగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం కేవలం రాజకీయం మాత్రమే చేసిందని ఆయన విమర్శించారు. అటువంటి నేపథ్యం ఉన్న కేటీఆర్‌కు రాహుల్ గాంధీని ప్రశ్నించే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
"విలువలు లేని రాజకీయాలు మంచివి కాదు. కేటీఆర్‌కు నైతిక విలువలు ఉంటే రాహుల్ గాంధీ గురించి మరోసారి మాట్లాడొద్దు. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, భారత రాష్ట్ర సమితి కేవలం ప్రాంతీయ పార్టీ. కేటీఆర్ ఇక్కడ (తెలంగాణలో) రాజకీయం చేయి. సీఎం, పీసీసీ చీఫ్, మేమంతా నీకు సిద్ధం. రాహుల్ గాంధీని విమర్శిస్తే విడిచిపెట్టను. రాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ దృష్టి పెట్టాలని, జాతీయ స్థాయి నేతలపై విమర్శలు మానుకోవాలని జగ్గారెడ్డి హెచ్చరించారు.