Jagadish Reddy: ఇందులో భాగస్వాములైన వారిని ఎవ్వరినీ వదలం
Jagadish Reddy: హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫామేషన్ పాలసీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు.
Jagadish Reddy: హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫామేషన్ పాలసీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. దోపిడీ దొంగల్లా భూముల కోసం హిల్ట్ పాలసీ అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. 5లక్షల కోట్ల ప్రజల ఆస్తిని 440మంది పంచుకోవాలని చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగస్వాములైన వారిని ఎవ్వరినీ వదలమన్నారు. న్యాయ పోరాటం చేస్తాం, భూములను కాపాడుతామన్నారు. భూ దోపిడీకి పాల్పడే వారిని తాము వచ్చాక జైలుకు పంపుతామని.. ప్రజా అవసరాల కోసమే ఇండస్ట్రీయల్ భూములు వినియోగించాలని జగదీష్ రెడ్డి సూచించారు.