Jadcherla Bus Accident: సంక్రాంతి వేళ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

Jadcherla Bus Accident: సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.

Update: 2026-01-14 09:00 GMT

Jadcherla Bus Accident: సంక్రాంతి వేళ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

Jadcherla Bus Accident: సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు.

హైదరాబాద్ నుంచి పెబ్బేరు మీదుగా కర్నూలు వెళ్తున్న కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదానికి గురైంది. బస్సు డీసీఎంను ఢీకొట్టడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌తో పాటు మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారిని నాలుగు అంబులెన్స్‌ల ద్వారా మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా కర్నూలు వైపు సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా పునరుద్ధరించారు.

Tags:    

Similar News