నల్గొండ మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..రేపే ఇంటర్వ్యూ

నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాళాశాలలో తాత్కాలిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Update: 2020-02-23 09:30 GMT

నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాళాశాలలో తాత్కాలిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 25 పోస్టులు ఖాళీలున్నాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ లాంటి విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ట్యూటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు గాను ఈ నెల 24వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 24వ తేది ఉదయం 10 గంటల వరకు నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కాళాశాలలో దరఖాస్తులను ఇవ్వాలని తెలిపారు. అదే రోజున దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేస్తామని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://dme.telangana.gov.in/ లేదా http://gmcnalgonda.in/ వెబ్‌సైట్స్‌లో చూడొచ్చు.

♦ మొత్తం ఖాళీల సంఖ్య - 25

♦ ప్రొఫెసర్ పోస్టులు - 4

♦ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు - 3

♦ అసిస్టెంట్ ప్రొఫెసర్- 7ట్యూటర్స్ పోస్టులు - 11

♦ దరఖాస్తుకు చివరి తేదీ, ఇంటర్వూ తేది ఫిబ్రవరి 24, 2020 ఉదయం 10 గంటలు

విద్యార్హత..

♦ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎండీ, ఎంఎస్ ఉండాలి.

♦ ట్యూటర్ పోస్టుకు ఎంబీబీఎస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తులు ఇవ్వాల్సిన చిరునామా:

Principal office,

Government Medical College,

Nalgonda.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...




Tags:    

Similar News