తెలంగాణలో మే 25 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

Update: 2019-04-29 03:01 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయి జూన్‌ 1తో ముగుస్తాయి. . వరుసగా ఎనిమిది రోజులు పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, జూన్‌ 3, 4 తేదీల్లో ఎథిక్స్, హ్యూమన్‌ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. వొకేషనల్‌ కోర్సుల పరీక్ష తేదీలు వాటి ప్రకారమే ఉండనున్నాయి. పరీక్ష ఫీజు స్వీకరణ మొదలు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌ పక్రియలో జాప్యం జరగడంతో ఈ మేరకు పరీక్ష తేదీలు ఆలస్యం అయ్యాయి. 




 


Similar News