Nizamabad: 6 కోట్ల బియ్యం మాయం.. కొనసాగుతున్న సివిల్ సప్లై అధికారుల తనిఖీలు

Nizamabad: అధికారుల ఫిర్యాదుతో చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు

Update: 2024-01-24 07:13 GMT

Nizamabad: 6 కోట్ల బియ్యం మాయం.. కొనసాగుతున్న సివిల్ సప్లై అధికారుల తనిఖీలు 

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టారు. వడ్లు తీసుకుని.. మిల్లింగ్ చేసిన తర్వాత తిరిగి ఇవ్వలేదని.. రైస్ మిల్ యాజమాన్యంపై ఫిర్యాదులు రావడంతో.. అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నవీపేట మండలం అభంగపట్నం‌లోని యునూస్ ట్రేడర్స్ రైస్ మిల్‌లో సోదాలు జరిపారు. 6 కోట్ల 18 లక్షల బియ్యం మాయం అయినట్టు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. 2020, 2021 ఏడాదిలో యాసంగి, వానాకాలంలో రైతులు పండించిన 26 వేల క్వింటాళ్ల వడ్లను తీసుకొని.. వారికి తిరిగి బియ్యం ఇవ్వలేదని అధికారులు గుర్తించారు. రైస్ మిల్ బండారం బయటపడటంతో.. అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రైస్ మిల్ యాజమాన్యంపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News