Income Tax Raids: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
Income Tax Raids: శంషాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలోను, రఘువీర్ ఇంటిపై సోదాలు
Income Tax Raids: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
Income Tax Raids: హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. 100 టీమ్‌లుగా ఏర్పడిన ఐటీ శాఖ అధికారులు.. తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు చేపట్టారు. పలు కంపెనీలతో పాటు వ్యక్తుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కూడబెట్టడం.. పన్ను ఎగవేత లాంటి అంశాలపైనే ఐటీశాఖ ఫోకస్ చేసింది. అమీర్‌పెట్‌లో ఆర్థిక వ్యాపారుల వద్ద నుండి కీలక డాకుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో పాటు.. అతని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. అలాగే శంషాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలోను, రఘువీర్ ఇంటిపై సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్ పల్లి హోసింగ్ బోర్డ్ 7వ ఫేజ్ లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్ మెంట్స్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రేపు కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది.