తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

* ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో వాయిదా

Update: 2023-02-11 03:20 GMT

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

Telangana Secretariat: తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. సచివాలయం ప్రారంభోత్సవంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎస్‌ సంప్రదించారు. అయితే సీఈసీ నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆశాజనకంగా లేకపోవడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. దీంతో త్వరలో మరో ప్రారంభోత్సవ తేదీ ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News