డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామంలో 95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 15 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.

S. Srikanth
Published on: 26 Nov 2019 10:57 AM IST
డబుల్  బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి
X
Minister Koppuka Eshwar

పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామంలో 95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 15 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ, 25.33 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీటిని మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత, పీఏసీఎస్ ఛైర్మన్ ఓరుగంటి రమణారావు, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్, ఎంపీపీ గోళి శోభ, సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్తులు పాల్గొన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story