Summer: మూడు నెలలు దంచికొట్టనున్న ఎండలు.. తెలంగాణలో మండుటెండలు: ఐఎండీ

Update: 2025-04-01 01:07 GMT

Summer: మార్చి నెల ముగిసిన ఏప్రిల్ నెల ప్రారంభమైంది. ఏప్రిల్, జూన్ మధ్య ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మధ్య, తూర్పు ప్రాంతాల్లో, వాయవ్య రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదు అవుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పలు చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ చెబుతోంది.

రాబోయే మూడు నెలలపాటు అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు ఎక్కువగా వడగాలులు వీస్తాయని తెలిపింది. మూములుగా అయితే ఈ మూడు నెలల్లో నాలుగు నుంచి ఏడు రోజుల వరకు వడగాలులు నమోదు అవుతుంటాయి. తెలంగాణ, కర్నాటక, ఏపీ, రాజస్థాన్, యూపీ, హర్యాణా, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా వడగాలులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఏప్రిల్ లో దేశంలో చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వివరించారు.

కాగా రానున్న మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధ, గురువారాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మొదలై ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 50 కిలోమీటర్లలోపు ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం, ఆదిలాబాద్ లో సాధారణం కంటే 2.4డిగ్రీలు పెరిగి 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 

Tags:    

Similar News