అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంచుతాం : సీఎం కేసీఆర్

Update: 2020-03-16 11:30 GMT

అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంచుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా పెంచుతామని అన్నారు. ఐదేళ్లలో కేంద్రం నుండి 1లక్ష 12వేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని చెప్పారు. 2014 నుండి 2019 వరకు 2లక్షల 72వేల 926 కోట్లు తెలంగాణ నుండి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లాయన్నారు.

రెండేళ్లలో సంపద పెరిగి అప్పులు తీరుతాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మద్యం షాపులు లేనట్లు మాట్లాడుతున్నారని, గతంలో మద్య నిషేధం అమలు చేస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని గుర్తుచేశారు. గ్రామాల్లో గుడుంబా బట్టీలు లేకుండా చేశామని, అవసరమైతే మద్యం ధరలు మళ్లీ పెంచుతామని సీఎం వెల్లడించారు. ఏ ప్రభుత్వం ఉన్నా విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ బస్ చార్జీలు పెంచుతుందని కేసీఆర్ చెప్పారు.

Tags:    

Similar News