Peddapally: పెద్దపల్లి జిల్లా లో పోచమ్మ తల్లి విగ్రహం మాయం
Peddapally: గ్రామాన్ని ఖాళీ చేస్తామంటున్న భూనిర్వాసితులు
Peddapally: పెద్దపల్లి జిల్లా లో పోచమ్మ తల్లి విగ్రహం మాయం
Peddapally: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్‌లోని పోచమ్మ దేవాలయంలో ఉన్న పోచమ్మ తల్లి దేవత మూర్తిని సింగరేణి అధికారులు తీసుకెళ్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు ఈ విషయం తెలియడంతో సింగరేణి ఓసీపీ-2 గేటు ముందు ఆందోళనకు దిగారు. గని లోపలికి వెళ్లే కార్మికులను అడ్డుకుంటూ.. ఓసీపీ గేట్ ముందు ధర్నా చేపట్టారు. గ్రామంలో ఇంకా 284 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని, మిగిలిన సమస్యలు పరిష్కరిస్తే గ్రామాన్ని పూర్తిస్థాయిలో ఖాళీ చేస్తామని భూనిర్వాసితులు చెబుతున్నారు. పోచమ్మ తల్లి విగ్రహాన్ని ఇవ్వాలని, లేకపోతే కదిలేదే లేదని ఆందోళన చేపట్టారు.