iBomma Ravi Case: ఐబొమ్మ రవిపై మరో మూడు కేసులు
iBomma Ravi Case: సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై మరో మూడు కేసులు నమోదయ్యాయి.
iBomma Ravi Case: ఐబొమ్మ రవిపై మరో మూడు కేసులు
iBomma Ravi Case: సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, నిర్మాత దిల్‌రాజుతో పాటు.. తండేల్ సినిమా పైరసీ పట్ల రవిపై ఫిర్యాదులు అందాయి. దీంతో.. రవిపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ మూడు కేసుల్లో ఐబొమ్మ రవికి మరో 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఐబొమ్మ రవి ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. రేపు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ఇంకోవైపు.. ఇదే కేసులో ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. జైలులోనే విచారించేందుకు అనుమతి కోరుతూ ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. దీంతో.. రవి బెయిల్ మంజూరుపై సందిగ్ధత నెలకొంది.