Hyderabad: ఫిలింనగర్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో వాతలు..
Hyderabad: ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ ఫిలింనగర్‌లో చోటుచేసుకుంది.
Hyderabad: ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ ఫిలింనగర్‌లో చోటుచేసుకుంది. ఓ ట్యూషన్ టీచర్ ఏడేళ్ల బాలుడి అట్లకాడతో వాతలు పెట్టింది. ఓయూ కాలనీకి చెందిన ఒకటవ తరగతి విద్యార్థి తేజ నందన్ చదవటం లేదనే కారణంతో చేతులు, కాళ్ళు, ముఖంపై ఇలా శరీరంపై 8 చోట్ల కాల్చింది. దీంతో తేజ నందన్ నడవలేకపోవటంతో.. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి, ట్యూషన్ టీచర్ మానసపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ట్యూషన్ టీచర్ మానసపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.