Hyderabad: కొండాపూర్‌లో రేవ్ పార్టీ రెయిడ్ – ఏడుగురి అరెస్ట్
నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందిన వెంటనే పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ పార్టీ జరుగుతుండగా, గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.

ఈ దాడిలో 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల డ్రగ్ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో తేజ, విక్రమ్, నీలిమ, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్, రాహుల్ ఉన్నారు.
వీరిలో తేజ, విక్రమ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారిగా, నీలిమ, పురుషోత్తంరెడ్డి, భార్గవ్ హైదరాబాద్ నివాసులుగా గుర్తించారు. చందన్, రాహుల్ బెంగళూరువారిగా పోలీసులు తెలిపారు. వీరిద్దరూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో బయటపడింది.
ఇక, 2023లో గోవాలో జరిగిన రేవ్ పార్టీలో నిందితులంతా పాల్గొన్నారని, ఆ పార్టీకి రాజమహేంద్రవరం డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్‌కు సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుతో ఆయనకు ఉన్న లింకులపై ఈగల్ టీమ్ దర్యాప్తు కొనసాగిస్తోంది.