Hyderabad Rains: ఇది మన అమీర్‌పేటే..!
సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం నగరంలో నానా అవస్థలు తెచ్చిపెట్టింది. అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ చుట్టుపక్కల భారీగా నీరు నిలిచిపోయింది. రోడ్డుపై సుమారు నడుంలోతు నీళ్లు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి సంబంధించి తీసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక పాతబస్తీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, దబీర్‌పురా, బహదూర్‌పురా, కాలాపతేర్, రామస్వామిగంజ్, ఛత్రినాక, మల్లేపల్లి వంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. ప్రధాన రహదారులన్నీ వరద నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పాదచారులు నీరు తగ్గే వరకు రోడ్డు పక్కన వేచి చూస్తున్నారు.
తెలంగాణ వెదర్ మ్యాన్ టి. బాలాజీ ఈ వర్షాలపై హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని సూచించారు.
ఈ వర్షంతో నగరం ఎలా అతలాకుతలమైందో చెబుతున్నాయి ఈ దృశ్యాలు… ఇది మన అమీర్‌పేటే..!