Hyderabad: భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. 1419 మంది బాధిత అమ్మాయిలకు విముక్తి..

Hyderabad: హైదరాబాద్ లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసింది.

Arun Chilukuri
Published on: 6 Dec 2022 4:08 PM IST
Hyderabad Police Busted Prostitution Gang
X

Hyderabad: భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. 1419 మంది బాధిత అమ్మాయిలకు విముక్తి..

Hyderabad: హైదరాబాద్ లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసింది. 17 మంది సెక్స్ రాకెట్ మఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు, SOT పోలీసుల సమిష్టి ఆపరేషన్ లో అరెస్ట్ చేశారు. వీరంతా దేశంలోని 15 నగరాల్లో తమతమ ఏజెంట్లను పెట్టుకుని హ్యూమన్ ట్రాపికింగ్ కు పాల్పడుతున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ 17 మంది ముఠా సభ్యులు దేశంలోని మొత్తం 15 ప్రధాన నగరాల్లో తమతమ ఏజెంట్లను నిమయించుకుని వెబ్ సైట్స్, వాట్సప్ గ్రూప్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు తెలిపారు.

ఏపీ , తెలంగాణా, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా కి చెందిన 1419 మంది యువతులున్నట్లు తెలిపారు. ఈ దాడిలో 1419 మంది అమ్మాయిలను గుర్తించి వారికి విముక్తి కల్పించినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అంతేకాదు ఈ దందాలో విదేశీ మహిళలను సైతం దించినట్లు సీపీ తెలిపారు. ఈ సెక్స్ రాకెట్ కు ఆర్నావ్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అతని ఇంట్లో MDMA డ్రగ్స్ కూడా గుర్తించి సీజ్ చేసి నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story