Hyderabad: గచ్చిబౌలిలో పిడుగు పడిన భయానక దృశ్యం… పరుగులు పెట్టిన ప్రజలు

హైదరాబాద్‌లో మళ్లీ వర్ష బీభత్సం మారుమోగింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. గచ్చిబౌలిలో ఖాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద ఉన్న HP పెట్రోల్ బంక్ ఎదుట ఒక తాటిచెట్టుపై పిడుగు పడింది.

Update: 2025-08-04 15:48 GMT

హైదరాబాద్ గచ్చిబౌలిలో పిడుగు పడిన భయానక దృశ్యం… పరుగులు పెట్టిన ప్రజలు

హైదరాబాద్‌లో మళ్లీ వర్ష బీభత్సం మారుమోగింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. గచ్చిబౌలిలో ఖాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద ఉన్న HP పెట్రోల్ బంక్ ఎదుట ఒక తాటిచెట్టుపై పిడుగు పడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పిడుగుతో తాటి చెట్టుకు మంటలు అంటడంతో ఆ దృశ్యం క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, నాగోలు, హయత్‌నగర్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీటి ప్రవాహం ఉధృతంగా కనిపించింది.

హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం, గాలిలో తేమ పెరగడంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంగా భారీ వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. షేక్‌పేట్‌లో 11.2 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 10.7 సెం.మీ, ఖైరతాబాద్‌లో 10.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. కూకట్‌పల్లిలో 8.7 సెం.మీ, అమీర్‌పేట్‌లో 8.3 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తెలంగాణలో 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Tags:    

Similar News