హైదరాబాద్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలి వారి వరకు కరోనా మహమ్మారికి బలైపోతున్నారు.

Update: 2020-04-19 12:23 GMT

హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలి వారి వరకు కరోనా మహమ్మారికి బలైపోతున్నారు.కరోనా వచ్చిన వారిలో ఎక్కువగా ఢిల్లీకి వెళ్లివచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే నగరంలోని 20 ఏండ్ల ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌కి కూడా కరోనా వ్యాపించింది. గత నెలలో యువకుడి తండ్రి ఢిల్లీ మర్కజ్‌ప్రార్థనలకు హాజరై నగరానికి వచ్చాడు. కాగా అతన్ని, అతని కుటుంబ సభ్యులను అధికారులు పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ లో ఉంచారు.

అతని తండ్రికి కరోనా పాజిటివ్‌ పరీక్షల్లో నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయి వారి కుటుంబాన్ని, వారితో సన్నిహితంగా ఉన్న వారిని సరోజినిదేవి ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్వారంటైన్‌కు తరలించారు. కాగా యువకుడికి జరిపిన పరీక్షల్లో అతనికి కూడా పాజిటివ్ రాగా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

యువకుడి తండ్రి మర్క్ జ్ వెల్లొచ్చిన తరువాత ఆ యువకుడి తండ్రితో సన్నిహితంగా ఉంటూ 20 వతేదీ వరకు నగరంలో వివిధ ఏరియాలలో సుమారుగా 25 మందికి ఫుడ్‌ డెలివరీ చేసినట్లు అంచనా. కాగా అధికారులు యువకుడు ఏయే రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తీసుకున్నారో, ఎవరెవరికి డెలివరీ చేసారో వారందరి వివరాలు సేకరించి వారందరినీ క్వారంటైన్ కు తరలించారు. ఆ యువకుడు గత ఏడాది కాలంగా ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News