హుజూర్‌నగర్ ఉపఎన్నికలో సీపీఐ మద్దతుపై ఉత్కంఠ

-హుజూర్‌నగర్ ఎన్నికల్లో సీపీఐ మద్దతుపై ఉత్కంఠ -సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్‌ ప్రయత్నాలు -కాసేపట్లో సీపీఐ కార్యాలయానికి టీఆర్ఎస్‌ బృందం -సీపీఐ నాయకులతో సమావేశం కానున్న కేకే, నామా, వినోద్‌ కుమార్ -కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్‌ను నమ్మొద్దు - ఉత్తమ్‌ -టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పేందుకు కాంగ్రెస్‌కే సీపీఐ మద్దతివ్వాలి - ఉత్తమ్‌

Update: 2019-09-29 10:30 GMT

హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో సీపీఐ మద్దతుపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన సీపీఐ ఈ సారి ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది తెలియనుంది. టీఆర్ఎస్‌ నాయకులు కేకే, నామా నాగేశ్వరరావు, వినోద్‌ కుమార్‌ సీపీఐ నేతలతో భేటీ కానున్నారు. అయితే దీనిపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ స్పందించారు. కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్‌ ను నమ్మొద్దన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ సీపీఐ మద్దతు కోరిందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ తో కలిసి రావాలని ఉత్తమ్‌ సీపీఐకి విజ్ఞప్తి చేశారు.  

Full View

Tags:    

Similar News