Crime News: భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Crime News: కొద్ది రోజులుగా భూక్యా శ్రీధర్, స్నేహల మధ్య కలహాలు

Update: 2023-05-21 05:51 GMT

Crime News: భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Crime News: కొత్తగూడెంలో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. కొద్ది రోజులుగా భూక్యా శ్రీధర్, స్నేహల మధ్య కలహాలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం సఖి కేంద్రంలో కౌన్సిలింగ్ సైతం ఇచ్చారని స్నేహ తండ్రి చెబుతున్నాడు. చాలా రోజులుగా శ్రీధర్ తన కూతురుని హింసిస్తున్నట్లు వాపోయాడు. అల్లుడు శ్రీధర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News