hmtv CFW Awards: కరోనా వారియర్స్‎కు హెచ్ఎంటీవీ నీరాజనం

hmtv CFW Awards: కరోనా వేళ ఎన్నో అగచాట్లు ఎన్నో సమస్యలు అప్పటి వరకు మనం ఎదుర్కోని ఎన్నో విపత్కర పరిస్థితులను కరోనా మనకు పరిచయం చేసింది.

Update: 2021-08-28 10:32 GMT

hmtv CFW Awards: కరోనా వారియర్స్‎కు హెచ్ఎంటీవీ నీరాజనం

hmtv CFW Awards: కరోనా వేళ ఎన్నో అగచాట్లు ఎన్నో సమస్యలు అప్పటి వరకు మనం ఎదుర్కోని ఎన్నో విపత్కర పరిస్థితులను కరోనా మనకు పరిచయం చేసింది. నా అన్నవారు కూడా సహాయం చేయలేని దుస్థితిని కరోనా మనకు కళ్లకు కట్టింది. అంతకు ముందెన్నడూ తెలియని జబ్బు వ్యవస్థలను ఆగమాగం చేసింది. ఒక్కసారిగా రాకాసి కరోనా విరుచుకుపడటంతో ఏం చేయాలో తెలియని అయోమయం. టెస్టింగ్‎లు లేవు మందులు లేవు ఇంకా చెప్పాలంటే మాస్కులు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో కరోనాను నియంత్రించేందుకు కేంద్రం లాక్‎డౌన్ తెచ్చింది. జనతా కర్ఫ్యూ అంటూ ఇళ్ల నుంచి జనాలను బయటకు రాకుండా కట్టడి చేసింది. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ ఆ నలుగురు ముందుకు వచ్చారు. వారే వైద్యులు, పోలీసులు, పారిశుధ్యకార్మికులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు.

ఆపదలో ఉన్న ప్రజలకు తోచిన విధంగా సేవ చేసి ధన్యజీవులయ్యారు. కరోనా కట్టడిలో ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో అమరులయ్యారు. వైద్యులు పగలనకా రేయనకా వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టారు. లాక్‎డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తూ ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా పహారా కాశారు పోలీసులు. కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా వీధులను అద్దల్లా మెరిసేలా చేశారు పారిశుధ్య కార్మికులు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా చిరస్మరణీయమైన సేవలు అందించారు. వారందరి సేవలను స్మరించుకోవాలని హెచ్ఎంటీవీ సంకల్పించింది. అందులో భాగంగా హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ రోజు సా. 6 గంటలకు సీఎఫ్‎డబ్ల్యూ అవార్డులను ప్రదానం చేస్తోంది. 

Tags:    

Similar News