హెచ్‌ఎంటీవీ 11వ వారికోత్సవ వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో విశ్వసనీయతకు, వేగానికి మారుపేరుగా వార్తా కథనాలు ప్రసారం చేస్తూ లక్షలాది మంది ప్రజల మన్ననలు పొందుతున్న న్యూస్‌ చానల్‌ హెచ్‌ఎంటీవీ.

Update: 2020-02-12 13:23 GMT

తెలుగు రాష్ట్రాల్లో విశ్వసనీయతకు, వేగానికి మారుపేరుగా వార్తా కథనాలు ప్రసారం చేస్తూ లక్షలాది మంది ప్రజల మన్ననలు పొందుతున్న న్యూస్‌ చానల్‌ హెచ్‌ఎంటీవీ. పదకొండేళ్ల ప్రాస్థానంలో ఎన్నో మైలురాళ‌్లను చేరుకుంటూ.. దూసుకెళ్తోన్న హెచ్ఎంటీవీ సామాన్యుడి గొంతుకను విన్పించడంలో అందరికంటే ముందుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రగతిబాటకు మార్గ నిర్దేశం చేస్తూ సాగుతోన్న కార్యక్రమాలతో పాటు... ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ‌్లడమే కాదు వాటి పరిష్కారానికి కృషి చేసింది. ప్రజల్లో మమేకమై వారి గొంతును వినిపిస్తోంది హెచ్‌ఎంటీవీ.

వరంగల్: హెచ్ఎంటీవీ 11వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి వీక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో దశ- దిశతో రాష్ట్ర నలుమూలలకు ఉద్యమాన్ని తీసుకెళ్లిన ఘనత హెచ్‌ఎంటీవీదేనని కొనియాడారు. నేలతల్లి, వక్త, పొలిటికల్‌ వార్తలు అందించడంలో హెచ్‌ఎంటీవీది ప్రత్యేక స్థానమన్నారు. నిజాలను నిర్భయంగా చూపించడంలో హెచ్‌ఎంటీవీ మొదటి వరుసలో ఉంటుందన్నారు.


Full View


ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హెచ్‌ఎంటీవీ 11వ వారికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోనకల్లులోని మానసిక వికలాంగుల ఆశ్రమ శాంతి నివాసంలో జరిగిన వేడుకల్లో జిల్లాపరిషత్‌ లింగాల కమల్‌ రాజ్‌ పాల్గొన్నారు. అనంతరం చిన్నారులకు పేట్లు, గ్లాసులతో పాటు ఫ్రూట్స్‌ను అందజేశారు.


Full View


Tags:    

Similar News