Mokila Plots: హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న మోకిల ప్లాట్స్

Mokila Plots: రోజూ ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30 ప్లాట్ల అమ్మకం

Update: 2023-08-25 03:13 GMT

Mokila Plots: హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న మోకిల ప్లాట్స్

Mokila Plots: ప్లాట్ల అమ్మకంలో మూడో రోజు ఈవాళ కూడా మరో 60 ప్లాట్లను ఈవేలం ద్వారా హెచ్ఎండిఏ విక్రయించనున్నది. తిరిగి 28, 29వ తేదీలలో రోజుకు 60 ప్లాట్ల చొప్పున ప్లాట్లను ఈ వేలం ప్రక్రియలో విక్రయించనున్నారు. హైదరాబాద్ శివారు భూములు సర్కారుకు కాసులు కురిపిస్తున్నాయి. కోకాపేట, బుద్వేల్, మోకిలా భూములు ఫుల్ డిమాండ్ కి అమ్ముడుపోయాయి. అయితే మోకిలాలో HMDA ప్లాట్ల రెండో దఫా వేలానికి మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు ఆన్ లైన్ వేలంలో గజం అత్యధికంగా లక్ష రూపాయల ధర పలకడం గమనార్హం. మోకిలలో హెచ్ఎండిఏ లేఅవుట్ లో ప్లాట్ల కొనుగోలుకు నిన్న రెండో రోజు అదే జోరు కొనసాగింది. గజం ధర అత్యధికంగా 72 వేలు పలికింది. మొత్తం 30 ప్లాట్ల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 131 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇక ఈ వేలం ఈ నెల 29 వరకు కొనసాగనుంది.

రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం, మోకిల ప్రాంతంలో హెచ్ఎండిఏ దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ఫ్లాట్లతో మోకిలలో రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందించింది. మోకిల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హెచ్ఎండిఏ లే అవుట్ లో ప్లాటు కొనుగోలు కోసం ఔత్సాహకులు ఈ - వేలంలో పాల్గొని పోటీపడి మరి ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.

మొదటి రోజు లాగే రెండవ రోజు అదే జోరు కొనసాగింది. నిన్న ఉదయం 30 ప్లాట్లను వేలం నిర్వహించగా, అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఉదయం జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా 72 వేలు పలుకగా, కనిష్టంగా గజం ధర 56 వేల వరకు పలికింది. మధ్యాహ్నం 30 ప్లాట్ లకు వేలం జరగగా అన్ని అమ్ముడుపోయాయి. మధ్యాహ్నం నుంచి జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా 75వేలు పలుకగా, కనిష్టంగా గజం ధర 56వేల వరకు పలికింది. మొత్తంగా రెండవ రోజు మోకిలలో 60 ప్లాట్ల అమ్మకం ద్వారా 131 కోట్ల 72 లక్షల ఆదాయం సమకూరింది.                         

Tags:    

Similar News