తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణితో విలీనమైంది. దీంతో రెండు మూడు రోజులపాటు అదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2019-10-05 07:52 GMT

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని గుంటూరు, కృష్ణ, ప్రకాశంతోపాటు, ఉత్తర కోస్తాలోను తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణితో విలీనమైంది. దీంతో రెండు మూడు రోజులపాటు అదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే హైదరాబాద్ తోపాటు నల్లగొండ, మహబూబ్ నగర్, జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.  

Tags:    

Similar News