తెలంగాణలో నేడు భారీ వర్షాలు..

ఒడిశా పరిసరాల్లో 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 5.8 నుంచి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణవాఖ అధికారులు తెలిపారు.

Update: 2019-09-03 01:22 GMT

ఒడిశా పరిసరాల్లో 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 5.8 నుంచి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణవాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, మెదక్, మంచిర్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్రలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. గత మూడురోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఇక నగరంలో కుండపోత వర్షాలకు ఎక్కడికక్కడ వర్షపు నీరు పొంగిపోర్లుతోంది. వర్షపు నీరుతో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. 

Tags:    

Similar News