Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

Update: 2023-09-04 05:56 GMT

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

Hyderabad Rain: హైదరాబాద్‌‌లో భారీ వర్షం కురుస్తుంది. వర్షం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసింది బల్డియా. అర్ధరాత్రి చినుకులతో మొదలై.. ఉదయం 6 గంటల నుంచి గంటన్నర పాటు దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట, మైత్రీవనం, మయూర్‌ మార్గ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా వరద నిలిచిపోవడంతో ఉదయం బయటకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

అలాగే జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, మూసాపేట్, సనత్ నగర్‌లలో బీభత్సంగా వర్షం కురిసింది. పలు భవనాల్లో సెల్లార్లలోకి, నార్సింగ్‌ మున్సిపాలిటీ బాలాజీనగర్‌ కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెంవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News