Harish Rao: అశోక్ నగర్‌లో వారి వీపులు కమిలేటట్లు కొట్టారు

Update: 2024-12-05 17:01 GMT

Harish Rao press meet: హరీష్ రావు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ నుండి కొద్దిసేపటి క్రితం విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారుపై హరీష్ రావు పలు ఆరోపణలు చేశారు. ఏ నిరుద్యోగులకైతే ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారో.. అదే నిరుద్యోగులను అశోక్ నగర్‌లో వీపులు కమిలేటట్లు కొట్టారని అన్నారు. ఏ గిరిజనులకైతే గొప్పగొప్ప మాటలు చెప్పారో.. అదే గిరిజనులను అర్ధరాత్రిపూట అరెస్ట్ చేసి జైళ్లలో నిర్భందించారని చెబుతూ... రేవంత్ రెడ్డి పాలన ఆనాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని అన్నారు. పోలీసులతో రాజ్యేమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోయిన దాఖలాలు లేవని, పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా పోలీసులు సహించలేదని హరీష్ రావు గుర్తుచేశారు.

కేసీఆర్ పేరు చెప్పకుండా రేవంత్ రెడ్డి స్పీచ్ లేదు

రేవంత్ రెడ్డి ఏడాది నుండి ఇస్తున్న ప్రసంగాల్లో ఒక్క స్పీచ్ అయినా కేసీఆర్ పేరు లేకుండా ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆరే కనబడుతున్నారు. అందుకే కేసీఆర్ పేరు లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ "ముఖ్యమంత్రివి ప్రజా సమస్యలపై మాట్లాడాలి కానీ ఎక్కడికెళ్లినా, ఏం చెప్పినా కేసీఆర్ పేరు చెప్పి విమర్శలు చేయడమే సరిపోతోంది" అని అన్నారు. 

Full View

ఇందిరమ్మ లాంటి వాళ్ల ప్రభుత్వాలనే కూకటివేళ్లతో పెకిలించివేసిన చరిత్ర భారతదేశం సొంతమని హరీష్ రావు చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్షాల గొంతును నొక్కేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News